తెలంగాణ గ్రూప్-4 పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సోమవారం కొంతమంది అభ్యర్థులు మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించారు. తుమ్మల TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి కాల్ చేసి.. తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని కోరారు. కాగా 2023లో గ్రూప్-4 పరీక్షలు నిర్వహించగా, 45 రోజుల క్రితం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. కానీ నియామక ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.