మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మహిళా సంఘాలకు ఐదేళ్ల కాలంలోనే రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఏడాదిలో రూ.25వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు వరంగల్ సభలో స్పష్టం చేశారు. ఈ రుణాలతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. మహిళా సంఘాలతో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయించడం చరిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించారు.