తెలంగాణలో స్వయం సహాయక బృందాల కోసం ప్రభుత్వం మహిళలకు మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనుంది. వీటి కోసం ఒక్కో నియోజకవర్గంలో 2-3 ఎకరాల భూమి సేకరించాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ.. ఒక్కో పార్కులో రెండంతస్తుల భవనాలను నిర్మించాలన్నారు. ప్రస్తుతం ఉన్న 65 లక్షల స్వయం సహాయక బృందాల సభ్యులను 75 లక్షలకు పెంచాలని సూచించారు.