అక్టోబర్ నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు పన్ను వాటాగా మొత్తం రూ.1,78,173 కోట్లు విడుదల చేసింది. ముందుగా చెల్లించిన రూ.89,086.50 కోట్లతో పాటు రూ.1,78,173 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. కేంద్రం విడుదల చేసిన నిధుల్లో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు ఉన్నాయి. కేంద్రం విడుదల చేసిన షేర్లలో ఉత్తరప్రదేశ్ రూ.31,962 కోట్లు, బీహార్ రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.13,987 కోట్లు, మహారాష్ట్ర రూ.11,255 కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.13,404 కోట్లు, ఒడిశా రూ.8,068 కోట్లు కేటాయించారు.