పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికను తీసుకొచ్చింది. పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీ (ఆదివారం) నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులకు‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా సెలవు రోజుల్లో భోజనం అందిస్తున్నారు. మార్చి 10వ తేదీ వరకు సెలవుల్లో పదో తరగతి విద్యార్థులు ఇంటి నుంచి మధ్యాహ్న భోజనం తీసుకురావాల్సిన అవసరం లేదని తెలిపారు. సెలవు రోజుల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రత్యేక తరగతుల్లో వారికి విద్యను అందిస్తున్నారు.