పెరిగిన నిత్యావసర ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సబ్సిడీ ధరలపై సరుకులు అందజేసేందుకు సిద్ధమవుతోంది. లీటర్ పామాయిల్ రూ.110, కందిపప్పు కేజీ రూ.67, అర కేజీ చక్కెర రూ.17కే అందించాలని మంత్రులు నాదెండ్ల, పయ్యావుల, అచ్చెన్నతో కూడిన కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు రైతు బజార్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2,200 రిటైల్ ఔట్లెట్లు ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా సబ్సిడీపై సరుకులు అందజేయనుంది.