తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త అందబోతోంది. ధరణి పోర్టల్ స్థానంలో ప్రజాభిప్రాయంతో రూపొందించిన భూ భారతి(BhuBharathi) చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పది రోజుల్లో www.BhuBharathi.telangana.gov.in అనే వెబ్ పోర్టల్ అందుబాటులోకి రానుందని తెలుస్తుంది. ఈ పోర్టల్ ఈ నెల 30న ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డొమెయిన్‌కు క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ ఆమోదం పొందగానే అందుబాటులోకి తీసుకొస్తారు.