హైదరాబాద్ ప్రజలుకు మరో భారీ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. నేడు ఆరాంఘర్- జూపార్క్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. దాదాపు 799 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఆరామ్‌ఘర్ కూడలి నుండి జూ పార్కు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్‌ను 4.08 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో అధికారులు దీన్ని నిర్మించారు. నగరంలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదే కాగా, ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో నగరంలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యల తగ్గనున్నాయి.