Homeహైదరాబాద్latest NewsHyderabad Traffic: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే.. ప్రభుత్వం కీలక...

Hyderabad Traffic: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Hyderabad Traffic: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నగర ప్రజలు చాలా సమయం ట్రాఫిక్ లోనే వృధా అవుతుంటుంది. అయితే ఈ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌లు నిర్మించాలని నిర్ణయిచింది. ఈ అభివృద్ధి పనులను మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీలుగా విభజించింది. హెచ్‌-సిటీ ప్రాజెక్టులలో భాగంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అతి త్వరలోనే వీటికి సంభందించిన పనులు ప్రారంభం కానున్నాయి. సంవత్సరం లోపు వీటికి సంబంధిన పనులు పూర్తవ్వాలని ప్రభుత్వం సూచించింది.

Recent

- Advertisment -spot_img