వచ్చే నెలలో ఉప్పల్ – నారపల్లి ఫ్లైఓవర్ పనులు ప్రారంభించకుంటే టెండర్ రద్దు చేస్తామని గాయత్రి కన్‌స్ట్రక్షన్ సంస్థను ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో ఫ్లైఓవర్ పనులు ప్రారంభించినట్లు ఆర్‌అండ్‌బీలోని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రకటించారు. ఇటీవలే నారపల్లిలోని సీపీఆర్‌ఐ సమీపంలో సర్వీస్ రోడ్డు పనులను కంపెనీ ప్రారంభించింది. ఈ రహదారిపై రాకపోకలకు అనుమతిస్తూ ఫ్లైఓవర్ పనులు చేపడతారు. ర్యాంపు నిర్మాణం, పిల్లర్ పనులు త్వరలో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 44 శాతం పనులు పూర్తయ్యాయని, పిల్లర్లు పూర్తి చేసి స్లాబ్‌లు వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 147 శ్లాబులు వేయాల్సి ఉండగా 37 మాత్రమే పూర్తయ్యాయన్నారు. ఈ పనులన్నీ ఏడాదిన్నరలో పూర్తి చేయాలని అధికారులు కంపెనీకి గడువు విధించారు.