కర్ణాటక ప్రజలకు అక్కడి విద్యుత్ పంపిణీ సంస్థలు గుడ్ న్యూస్ అందించాయి. 15 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గాయి. కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (KERC) విద్యుత్ ఛార్జీలను సవరించింది.
నూతన విద్యుత్ టారిఫ్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. 100 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వారికి యూనిట్‌కు రూ.1.10 తగ్గింపు లభించనుంది. దీని ప్రకారం వచ్చే నెల కరెంట్ బిల్లులు రానున్నాయి.