రాష్ట్రంలో భూమిలేని నిరుపేద కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రజా ప్రభుత్వం పేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీని ఈ నెల 28 నుంచి అమలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు డిసెంబర్ 28న తొలి విడతగా రూ. 6వేలు పేద కూలీలకు అందజేస్తామన్నారు.