ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ, అనుబంధ స్కూళ్లలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు NMMS స్కాలర్‌షిప్‌కు అర్హులు. ప్రైవేట్, కేంద్రీయ, నవోదయ, గురుకులాలు, వసతితో కూడిన స్కూళ్లలో చదివేవారు అనర్హులు. పేరెంట్స్ వార్షికాదాయం రూ.3.5 లక్షలకు మించకూడదు. 7వ తరగతిలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎంపికైతే 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు నెలకు రూ.1,000 ఇస్తారు. ఏపీలో సెప్టెంబర్ 6 వరకు, తెలంగాణలో నవంబర్ 9 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. https://portal.bsetelangana.org/NMMSTFR/Account/Login.aspx ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.