తెలంగాణలోని నిరుద్యగులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ పూర్తిగా అస్త్వవ్యస్థం అయ్యిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పదేళ్లపాటు రిక్రూట్మెంట్ జరగలేదని, TGPSC ద్వారా 1300 పోస్టులను భర్తీచేస్తామని వివరించారు. గత ప్రభుత్వంలో 811 టీఎంసీల నీటిలో 299 టీఎంసీలు తెలంగాణకు, 519 టీఎంసీలు ఆంధ్రకు ఇచ్చేలా ఒప్పందం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ రాగానే 500 టీఎంసీ తెలంగాణకు ఇవ్వాలని ట్రిబ్యునల్ ముందు ఉంచినట్లు పేర్కొన్నారు.