నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో 3,038 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. ఈ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ ఉద్యోగాలలో 2,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ (వర్కర్) ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్), 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ పోస్టులతో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి. అదనంగా, 23 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్), 11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్), 6 అకౌంట్ ఆఫీసర్లు, 7 మెడికల్ ఆఫీసర్లు (జనరల్), 7 మెడికల్ ఆఫీసర్లు (స్పెషలిస్ట్) పోస్టులు కూడా ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ TGSRTC సిబ్బంది బలోపేతానికి దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు.