రైల్వేశాఖలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వేలో 4,232 అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించారు. వీటి కోసం అప్లై చేయాలనుకునేవారు 10వ తరగతి ఉత్తీర్ణులై, ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఇప్పటికే ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగా, జనవరి 27, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.