తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ TGNPDCL నుండి త్వరలో 3,500 ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో 1550 జూనియర్ లైన్ మెన్, 2000+ ఏఈ, ఏఈఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ITI, ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు జీతాలు ఉంటాయి. జీతంలో TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సులు మరియు ప్రయోజనాలు ఉంటాయి.తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నోటిఫికేషన్ డిసెంబర్ లేదా జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది మరియు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.