తెలంగాణలో ఇటీవల 11,062 పోస్టులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం మరో డీఎస్సీకి కసరత్తు చేస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్-జులైలోపు నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలోపు టెట్ కూడా నిర్వహించే ఛాన్స్ ఉంది. ప్రస్తుత డీఎస్సీతో ఎంతమంది ఉపాధ్యాయులు భర్తీ అవుతారు? ఇంకా ఎన్ని ఖాళీలుంటాయనే సమాచారాన్ని జిల్లాల వారీగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.