ఏపీలో మరమగ్గాలు ఉన్న వారికి 500 యూనిట్లు, చేనేత మగ్గాలు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని మంత్రి సవిత తెలిపారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, 5 శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్ కల్పిస్తామన్నారు. విజయనగరం, కర్నూలులో చేనేత శాలలు ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం విదేశాల్లో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తామన్నారు.