వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్ రానుంది. ‘ఆటోప్లే యానిమేటెడ్ ఇమేజెస్’ పేరుతో వచ్చే ఈ ఫీచర్‌తో ఎమోజీ, స్టికర్స్, అవతార్స్‌కు సంబంధించి యానిమేషన్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఈ ఫీచర్ ను మనం డిజేబుల్ లేదా ఎనేబుల్ చేసుకోవచ్చు. మన ప్రాధాన్యతకు తగ్గట్లుగా యాప్‌లో చాట్ సెట్టింగ్స్‌ను మార్చుకునే వెసులుబాటును తీసుకురానున్నారు. అయితే GIFs విషయంలో మాత్రం ఇది పనిచేయదు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.