ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైన మందులు, పరికరాలను కొనుగోలు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో మాత్రమే ఐవీఎఫ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.