తెలంగాణలోని పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. వీరికి రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆన్ లైన్ లో ఏకకాలంలో జీతాల చెల్లింపు జరిగేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికీ ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.