ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ‘కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది నుంచి జగన్ సర్కారు జీతాలు నిలిపివేసి రాక్షసానందం పొందారు. ఈ విషయాన్ని అక్కడి ఉద్యోగులు నా దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు రూ.2.86 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది’ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.