రేషన్ కార్డులు ఉన్నవారికి ఫిబ్రవరి లేదా మార్చి నుంచి సన్నబియ్యం ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కరికి 6కిలోలు చొప్పున ఇవ్వనుంది. రేపు జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని వెంటనే మిల్లుకు పంపిస్తే బియ్యం సరిగ్గా రావని, అందుకే 2నెలలు తర్వాత మిల్లాడించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.