బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. నిన్న తో పోలిస్తే.. ఇవాళ మళ్లీ తగ్గాయి. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 400 తగ్గి.. రూ. 82,300 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 440 తగ్గి.. రూ. 89,780 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.2,000 తగ్గి.. రూ. 1,10,000 గా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.