తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే ఆశావాహులకు గుడ్ న్యూస్ చెప్పింది. సర్పంచ్ గా పోటీచేసే వారు ఇద్దరు పిల్లలు మించి ఉండొద్దని.. ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధన ఉండేది. అయితే ఆ నిబంధనను తొలగిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. ముగ్గురు లేదా ఆపై ఎంత మంది పిల్లలున్నా సరే సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అర్హులు అని తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు.