క్రిస్మస్, న్యూ ఇయర్‌కి ఊటీ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. డిసెంబరు 25,27,29,31వ తేదీల్లో ప్రత్యేక రైళ్లు మేట్టుపాళయంలో బయలుదేరి ఊటీ చేరుకుంటాయి. 26, 28, 30, జనవరి 1వ తేదీల్లో ఊటీలో బయలుదేరి మేట్టుపాళయంకు చేరుకుంటాయి. కున్నూరు- ఊటీ, ఊటీ-కేథి మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.