తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో త్వరలో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరాబాబు వెల్లడించారు. హైదరాబాద్ ప్రగతినగర్లోని ఎలీప్ మహిళా పారిశ్రామికవాడ ఎస్టేట్లో ‘ఎంఎస్ఎంఈ డిఫెన్స్ కాన్ క్లేవ్’, అంశంపై శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ‘ఇందిరా మహిళా శక్తి పథకానికి ఇప్పటికే రూపకల్పన పూర్తయింది. తొందరలోనే ప్రజల్లోకి తీసుకొస్తామన్నారు.