ఏపీలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ అందించనుంది. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. దీని ద్వారా 18-59 ఏళ్ల మహిళల ఖాతాలో ప్రతి నెలా రూ.1,500 చొప్పున జమ చేయనుంది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకి రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వడంపైనా విధివిధానాలు ఖరారు చేయాలన్నారు.