తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుండి ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 63.86 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు సంవత్సరానికి రెండు చీరల చొప్పున మొత్తం 1,27,72,000 చీరలను పంపిణీ చేయడానికి ఉత్పత్తి వేగంగా జరుగుతోంది. జూలై నాటికి చీరలు సిద్ధంగా ఉంటాయని తెలిపింది. బతుకమ్మ చీరల స్థానంలో స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ప్రతి సంవత్సరం రెండు ఉచిత చీరలను అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.