తెలంగాణలోని పొదుపు సంఘాల మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళకు ఆటోను పంపిణీ చేశారు. పొదుపు సభ్యురాలు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ వాహనాన్ని ఇస్తారు. స్త్రీనిధి రుణం నుంచి కొనుగోలు చేసే ఈ వాహన రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆటోలకు ఛార్జింగ్ పాయింట్ల కోసం అధ్యయనం చేస్తున్నారు.