Homeహైదరాబాద్latest Newsమేడారం వెళ్లే మహిళలకు Good News

మేడారం వెళ్లే మహిళలకు Good News

ఇదే నిజం, వరంగల్ ప్రధాన ప్రతినిధి : మేడారం జాతరకు వచ్చే మహిళా భక్తులకు మహాలక్ష్మి పథకం ద్వారా తమ ప్రభుత్వం ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్నదని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. తాడ్వాయి మండలం మేడారంలో జాతర కోసం ప్రత్యేకంగా అరవై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు బస్ స్టాండు ప్రాంగణాన్ని ఆమె శనివారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేకంగా ఆరు వేల బస్ లను నడపడానికి సిద్దంగా ఉందని, మహాలక్ష్మి పథకం ద్వారా జాతరకు మహిళ భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత జాతర తో పోలిస్తే ఈ సారి జాతరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అరవై ఎకరాల స్థల విస్తీర్ణం లో సువిశాల బస్ స్టాండ్ ప్రాంగణం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 18 తేదీ నుంచి 25 వ తేదీ వరకు భక్తులకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, ఏటూరు నాగారం అదనపు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ , వరంగల్ ఆర్ ఎం శ్రీలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img