వరుసగా పెరిగిన బంగారం ధరలు నిన్న నిలకడగా ఉండగా.. నేడు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,870గా ఉంది. ఇవే ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్నాయి.