మహిళలకు అదిరిపోయే శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతున్నందున బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.79,900కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.87,160కి చేరుకుంది. మరోవైపు, వెండి ధర కిలోకు రూ.100 పెరిగి రూ.1,08,100కి చేరుకుంది.