Homeహైదరాబాద్latest Newsఏపీలోని మహిళలకు శుభవార్త.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

ఏపీలోని మహిళలకు శుభవార్త.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన మరో మాట నిలబెట్టేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో డ్వాక్రా రుణాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీంతో లక్షలాది మంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 వేలు సబ్సిడీగా ఇస్తారు. ఇక్కడ విశేషం ఏమిటంటే డ్వాక్రా మహిళలు సబ్సిడీ పోయిన తర్వాత మిగిలిన మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు, తయారీ వంటి వ్యాపారాలు నిర్వహించే వారికి వడ్డీ లేకుండా ఈ రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా రుణగ్రహీతలు రాయితీ మొత్తాన్ని చివరలో తగ్గింపుగా స్వీకరిస్తారు.రుణాలు పొందుతున్న మహిళలు 2 నుండి 5 సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లించే వెసులుబాటు ఇవ్వబడింది.

Recent

- Advertisment -spot_img