ఏపీలో ఉచిత బస్సు పథకం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు ఇది శుభవార్త. సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతి కానుకగా ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పల్లె వెలుగుల వరకు ఈ పథకాన్ని అమలు చేయాలా… లేక ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని ప్రభుత్వం అధ్యయనం చేసింది.