Homeహైదరాబాద్latest Newsమహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు పై కీలక ప్రకటన..!

మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు పై కీలక ప్రకటన..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రవాణా శాఖ, ఇతర మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ పథకానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలను ఆర్టీసీ అధికారులు నివేదికలో వివరించారు. ఉచిత బస్సు ప్రయాణానికి అదనంగా 2,000 బస్సులు, 3,500 డ్రైవర్లు అవసరమని చెప్పారు. ఆర్టీసీకి ప్రతి నెలా దాదాపు 250 నుంచి 260 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించి నిర్దిష్ట విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు దృష్టి సారించారు.

Recent

- Advertisment -spot_img