Homeహైదరాబాద్latest Newsమహిళలకు శుభవార్త.. ఆ పథకం ద్వారా రుణాలు..!

మహిళలకు శుభవార్త.. ఆ పథకం ద్వారా రుణాలు..!

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా లక్షల మంది స్వయం సహాయక మహిళలకు లబ్ధి చేకూరాలనేది లక్ష్యం. దీనికి తోడు.. స్త్రీనిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం సహా వివిధ మార్గాల ద్వారా ఆర్థిక సాయం అందజేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో ఉచిత వృత్తి, నైపుణ్య ట్రైనింగ్ ఇప్పించి, మార్కెటింగ్‌‌ మెలకువలు నేర్పించేలా కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా రుణ సదుపాయం కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చిన్నతరహా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని ఈ ఏడాది మార్చి నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద.. స్వయం సహాయక బృందంలోని సభ్యురాలు మరణిస్తే ఆమె పేరుతో ఉన్న రుణాన్ని గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు.
రుణ బీమా పథకంతో మహిళా సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది సభ్యులకు జీవిత బీమా సౌకర్యం లభించనుంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి తరపున రూ.10 లక్షల జీవిత బీమా వర్తింపజేస్తారు. పట్టణ ప్రాంతాల్లో (మెప్మా), గ్రామీణ ప్రాంతాల్లో (సెర్ప్) అధ్వర్యంలో ఉండే స్వయం సహాయక సంఘాల మహిళలు ఇందుకు అర్హులు. ప్రభుత్వం ఇస్తున్న ఈ రుణ సదుపాయాలు, వివిధ పథకాల ద్వారా రుణాలు పొందేందుకు మహిళలు తప్పనిసరిగా స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉండాలి. ఆ తర్వాత ఏ వ్యాపారం చెయ్యాలనుకుంటున్నారో, అందుకు సంబంధించిన వివరాల రిపోర్టును.. బృంద ఇన్ఛార్జికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ఇన్ఛార్జి.. ఆ రిపోర్ట్ ఆధారంగా ఎంత రుణం అవసరమో, దాన్ని ఏ పథకం ద్వారా రాబట్టాలో ఆలోచించి, ఆ ప్రకారం చేస్తారు. తద్వారా.. మహిళలు తక్కువ వడ్డీకే రుణాలు పొంది, ప్రతి నెలా సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది మహిళలు లబ్ది పొందుతున్నారు.

Recent

- Advertisment -spot_img