తెలంగాణ ప్రభుత్వం మహిళా శుభవార్త చెప్పింది. 20 మహిళా శక్తి బస్సులు ఆర్టీసీ డిపోలకు చేరుతాయి. రెండు దశల్లో మొత్తం 600 బస్సులను పంపిణీ చేస్తున్నారని తెలుస్తుంది. మొదటి దశలో 150 బస్సులు, రెండవ దశలో 450 బస్సులను పంపిణీ చేస్తారని సమాచారం. ఈ బస్సులను మండల మహిళా సమాఖ్యలు కొనుగోలు చేసి ఆర్టీసీకి లీజుకు ఇస్తారు. ఆర్టీసీ నెలకు రూ.77,220 చెల్లిస్తుంది. కాగా, వీటిని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న ప్రారంభించిన విషయం తెలిసిందే.