మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ‘శక్తి’ యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. ‘గివ్ ఏ కంప్లైంట్’ విభాగంలోకి వెళ్లి, అందులో సంబంధిత జిల్లా, పోలీస్ స్టేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఫిర్యాదు చేస్తున్న అంశంతో పాటు మీ వివరాలను ఎంటర్ చేయాలి. కాగితంపై రాసిన లేదా టైప్ చేసిన కంప్లైంట్‌ని అప్‌లోడ్ చేయాలి. అనంతరం పోలీసులు దానిని పరిశీలించి మిమ్మల్ని సంప్రదిస్తారు. వేధింపులు, గృహహింస, అత్యాచారం, లైంగిక దాడులు, ఈవ్ టీజింగ్, యాసిడ్ దాడులు, మానవ అక్రమ రవాణా కేసులపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఫోన్ నుంచే ఫిర్యాదు చేయవచ్చు. వీటితో పాటు బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, కిడ్నాప్, సైబర్ బుల్లీయింగ్, ఫొటో మార్ఫింగ్, తదితర నేరాలపై కంప్లైంట్ చేయొచ్చు.