కేంద్ర ప్రభుత్వం 41 రకాల ఔషధాలపై ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మధుమేహం, గుండె, లివర్ సహా పలు రకాల జబ్బులకు సంబంధించిన మెడిసిన్స్ ధరలను వెంటనే తగ్గించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆదేశించింది. దేశంలో 10 కోట్లకు పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారికి ప్రయోజనం చేేకూరుతుందని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) అభిప్రాయం వ్యక్తం చేసింది.