Kajal Gautham kichlu : కాజల్ గౌతమ్ కిచ్లూ.. త్వరలో ముగ్గురు


Kajal Gautham kichlu : దక్షిణాదిలో ఎన్నో సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీతో ఉంది.
ఈ విషయాన్ని ఆమె భర్త గౌతమ్ కిచ్లూ వెల్లడించారు.
హీరోయిన్ కాజల్.. ప్రస్తుతం సినిమాలు ఏవి చేయడం లేదు.
‘ఆచార్య’ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసి భర్తతో సమయాన్ని ఆస్వాదిస్తోంది.
Corona Third Wave : భారత్‌లో కొవిడ్ థర్డ్ వేవ్ గ్యారెంటీ
Banking Rules : మారిన బ్యాంకుల రూల్స్.. కొన్ని భారం.. మరికొన్ని మంచి..


అయితే ఆమె గర్భవతి అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
కానీ న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
కాజల్ ఫొటోను పోస్ట్ చేసిన గౌతమ్.. ప్రెగ్నెంట్ ఉమన్ ఏమోజీని క్యాప్షన్‌లో పోస్ట్ చేశారు.
తద్వారా అధికారికంగా ఈ విషయాన్ని చెప్పినట్లయింది.
ఈ జంటకు 2020 అక్టోబరు చివర్లో పెళ్లి అయింది.
Krithi Shetty : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..


కాజల్ హీరోయిన్గా.. తమిళంలో ‘కరుంగపియమ్’, ‘ఘోష్టీ’, ‘హే సినామిక’ సినిమాల షూటింగ్ పూర్తయింది.
తెలుగులో ‘ఆచార్య’, హిందీలో ‘ఉమ’ చిత్రీకరణ కూడా పూర్తయింది.
‘ఇండియన్ 2′(తెలుగులో భారతీయుడు 2)లో హీరోయిన్గా నటిస్తోంది.
‘క్వీన్’ తమిళ రీమేక్ ‘పారిస్ పారిస్'(తమిళం) రిలీజ్ కావాల్సి ఉంది.
Miss India Manasa Varanasi Photo Gallery
Malavika Sharma : సోషల్‌మీడియాలో తగ్గేదేలే అంటుందిగా..

