Homeహైదరాబాద్latest Newsగోల్డ్ లోన్ తీసుకునే వారికి ఆర్‌బీఐ శుభవార్త.. ఇకపై రానున్న ఆ ఆప్షన్ ..!

గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఆర్‌బీఐ శుభవార్త.. ఇకపై రానున్న ఆ ఆప్షన్ ..!

బ్యాంకులు, గోల్డ్ లోన్ కంపెనీలు నెలవారీ వాయిదాల్లో అప్పులు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయి. బంగారు రుణాల పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని ఆర్‌బీఐ సూచించడంతో ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో EMI ద్వారా బంగారు రుణాలను చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోల్డ్ తాకట్టు పెట్టుకొని.. లోన్లు ఇచ్చే సంస్థలు కస్టమర్లకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఇస్తున్నాయి. అంటే లోన్ టెన్యూర్ పూర్తయిన తర్వాత గ్రహీత తీసుకున్నటువంటి మొత్తం లోన్ ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే.. కాలపరిమితికి ముందుగానే రుణ గ్రహీత వద్ద నిధులు అందుబాటులో ఉంటే.. అప్పటికి అసలు, వడ్డీ మొత్తం తిరిగి చెల్లించి గోల్డ్ విడిపించుకునే సౌలభ్యం ఉంటుంది.ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 20 నాటికి దేశంలోని అన్ని బ్యాంకుల్లో దాదాపు రూ. 1.4 లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలు మంజూరు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 14.6 శాతం ఎక్కువ. బంగారం ధరలు పెరగడమే ఇలాంటి రుణాలు పెరగడానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img