వ్యవసాయం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, ఈ క్రమంలో వారి కోసం కేంద్రం పల్లు పథకాలు అమల్లోకి తెచ్చింది.చిన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అలాంటి ఒక చొరవ, కిసాన్ ఆశీర్వాద్ పథకం, 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమిని కలిగి ఉన్న రైతులకు మంచి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పధకం కింద 5 ఎకరాలు ఉన్న రైతులకు ఏడాదికి ₹25,000 ఇవ్వనున్నారు. అలాగే 4 ఎకరాలు ఉన్న రైతులు సంవత్సరానికి ₹20,000, 2 ఎకరాలు ఉన్న రైతులు సంవత్సరానికి ₹5,000 నుండి ₹10,000 కేంద్రం ఇవ్వనుంది.
ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు.. ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు,రెవెన్యూ డిపార్ట్‌మెంట్ సర్టిఫికేట్,భూమి హక్కు పత్రాలు, పహాణి లేఖ, భూమి పన్ను చెల్లింపు రసీదు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అవసరం. నియమించబడిన కేంద్రాలను సందర్శించి.. దరఖాస్తును స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు లేదా వ్యవసాయ సంక్షేమ కేంద్రాలకు సమర్పించండి. రైతులు ఆలస్యం చేయకుండా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని, సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చూడాలని సూచించారు.