టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఇండోర్ నెట్‌వర్క్‌ను 20కిపైగా జిల్లాల్లో మెరుగుపర్చినట్టు తెలిపింది. 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌తో 3,450కిపైగా టవర్లను అప్‌గ్రేడ్ చేసినట్లు వివరించింది. తద్వారా కస్టమర్లకు మెరుగైన నెట్వర్క్ లభిస్తుందని పేర్కొంది. రూ.691 కోట్లతో 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 2.4 మెగాహెట్జ్ కొనుగోలు చేసినట్టు వెల్లడించింది.