కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 7వ వేతన సంఘం సిఫార్సులను ఆగస్ట్ 1 నుంచి అమలు చేయాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. 7 లక్షల మందికిపైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపును అసెంబ్లీ సమావేశాల్లో సీఎం సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మూతవేతనంలో 27.5 శాతం పెంచాలని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.సుధాకర్ రావు నేతృత్వంలోని 7వ వేతన సంఘం సూచించింది.