Homeహైదరాబాద్latest Newsశుభవార్త.. ఆ రైతులకు ప్రభుత్వం దసరా కానుక..!

శుభవార్త.. ఆ రైతులకు ప్రభుత్వం దసరా కానుక..!

తెలంగాణ పామాయిల్ రైతులకు దసరా ముందు కేంద్రం తీపి కబురు అందించింది. ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 5.5 % నుండి 27.5 %కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేశారు. దీని వలన ముడిపామాయిల్ గెలల ధర రూ.14,392 నుండి అమాంతం రూ.2651 పెరిగి ప్రస్తుతం రూ.17,043 చేరుకుంది. ఈ నెల నుంచే పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. దీంతో రైతులకు ఈ నెలలో అదనంగా రూ. 12 కోట్లు లబ్ధి చేకూరనుంది.

Recent

- Advertisment -spot_img