కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. జీవిత బీమా & ఆరోగ్య బీమాపై GST తగ్గనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం త్వరలో జరగనుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై ప్రస్తుతం 18 % జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ కౌన్సిల్ భేటీలో 5 % తగ్గించే అవకాశం ఉంది. దీని కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 36,000 కోట్ల నష్టం కలుగుతుందని అంచనా.