Homeహైదరాబాద్latest Newsగుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..!

గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..!

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు అదిరే గుడ్‌న్యూస్ చెప్పింది. సిలిండర్ రేటు రూ.72 మేర తగ్గించింది. జూన్ 1 నుంచి కొత్తరేట్లు అమలులోకి రానున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గగా.. డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల సిలిండర్ ధర దాదాపు రూ.860గా ఉంది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర కడపలో రూ.1,846, హైదరాబాద్‌లో రూ.1,903గా కొనసాగుతోంది. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1745 నుంచి రూ.1676కు పడిపోయింది. ముంబైలో రూ.1698 నుంచి రూ.1629కి తగ్గింది.

Recent

- Advertisment -spot_img