ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 4.50 లక్షల ఇళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఇస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి ఇంటి ఫోటో తీసి యాప్‌లో నమోదు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.